హైదరాబాద్: 28°C
తెలంగాణ

దళితులను అవమానించడం సరికాదు: కొనింటి సురేష్

VKB: మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్దకు దళితులు వచ్చారనే కారణంతో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడాన్ని తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కొనింటి సురేష్ తీవ్రంగా ఖండించారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలు సామాజిక సమానత్వానికి విరుద్ధమన్నారు.