సిద్ధిపేట మండలంలోని గౌరవెల్లి, అక్కన్నపేట ఎంపీపీఎస్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గుగులోతు మల్లేశం, దేవర కనకయ్య జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. శుక్రవారం నిర్వహించిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఎంపీ రఘునందన్‌రావు, జిల్లా కలెక్టర్ హైమావతి చేతుల మీదుగా మల్లేశం, కనకయ్య అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు.
తెలంగాణ
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా మల్లేశం, కనకయ్య


