హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో అమరవీరుల సంస్మరణ

ప్రకాశం: గిద్దలూరు టైగర్ ప్రాజెక్ట్ అటవీ డివిజన్ కార్యాలయంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలప స్మగ్లర్లు, తీవ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరవీరులకు డీడీపీటీ నిషా కుమారి శ్రద్ధాంజలి ఘటించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణలో అటవీ సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడారు.