హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలి'

ASR: ఆరు నెలల ఉచిత రెసిడెన్సియల్ ఏఐ శిక్షణకు ఆసక్తిగల గిరిజన యువత దరఖాస్తు చేసుకోవాలని పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ శుక్రవారం సూచించారు. పెదబయలు వైటీసీలో 70మందికి, కొత్తవలస హెచ్ఎన్ టీసీలో 50మందికి శిక్షణ ఇస్తామన్నారు. 18నుంచి 30ఏళ్ల లోపు వయసు కలిగిన డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ డిప్లొమా కలిగిన యువత ఈనెల 18లోగా కార్యాలయంలో ధరఖాస్తులు అందించాలన్నారు.