నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బిల్లకంటి హరిబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో శ్రీకర్ ఆస్పత్రి వైద్య సిబ్బంది పలువురికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
తెలంగాణ
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం


