హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి'

BDK: చర్ల మండల ఆదివాసి పోడు రైతులు ఇవాళ ఐటీడీఏ APO డేవిడ్ రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ.. 2005 కంటే ముందు నుంచి పోడు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని,26 సంవత్సరాల తర్వాత అటవీ అధికారులు రైతులను భయభ్రాంతులను గురి చేయడం ఏంటని మండిపడ్డారు. ఆదివాసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.