MBNR: మిడ్జిల్ (మం) కంచన్‌పల్లిలో శుక్రవారం జనరల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. సుమారు 100 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి, షుగర్, బీపీ పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందించారు. టీబీ అనుమానితులైన 25 మంది నుంచి కఫం నమూనాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మీర్జా, డాక్టర్ శశాంక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
కంచన్‌పల్లిలో జనరల్ హెల్త్ క్యాంపు


