హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖైరతాబాద్ గణేశ్ ఆగమన్‌కు అంతా సిద్ధం!

HYD: ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ తయారీ పనులు పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు భక్తుల కోలాహలం, బాణసంచా వెలుగుల మధ్య ఆగమన్ వేడుక జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారికి కళ్లు దిద్దడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు, ట్రాఫిక్ డైవర్షన్లు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.