హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముందస్తుగా హిందీ దినోత్సవ వేడుకలు

SRCL: గంభీరావు పేట మండలం దమ్మన్నపేటస్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ముందస్తు హిందీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హిందీ భాష ప్రాముఖ్యత, విశిష్టతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిత్రలేఖనం, హిందీ క్విజ్, ఉపన్యాస పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విజేతలను అభినందించారు. హిందీ ఉపాధ్యాయురాలు జడల విజయశ్రీని సన్మానించారు.