హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇల్లు కూల్చివేత.. సీపీఎం ఆగ్రహం

గద్వాల (మం) రేపల్లెలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారన్న కోపంతో దళిత యువకుడి ఇంటిని జేసీబీతో కూల్చివేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి శుక్రవారం మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఈ దురాగతానికి పాల్పడిన వారిపై, ప్రోత్సహించిన సర్పంచ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.