హైదరాబాద్: 28°C
తెలంగాణ

22A అంశంపై పొంగులేటి అబద్ధాలు: హరీశ్‌రావు

​సిద్దిపేట 22A కింద ఏ భూమిని చేర్చలేదనడం మంత్రి పొంగులేటి చెప్పే పచ్చి అబద్ధమని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ హయాంలో లేని సమస్యలను రేవంత్ ప్రభుత్వం 30 శాతం కమీషన్ల కోసమే సృష్టిస్తోందని ఆరోపించారు. పొంగులేటికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు BRS పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.