హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలి'

శ్రీకాకుళంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధితో పాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు.