హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైలాని బాబా దర్గాలో ప్రార్థనలు

SRD: మండల కేంద్రమైన సిర్గాపూర్ సైలాని బాబా దర్గాలో శుక్రవారం కులమతాలకతీతంగా అమావాస్య ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. సైలాని బాబా దర్గాపై కొత్త చాదర్, పూల చాదర్ కప్పి ప్రార్థనలు చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో తరుబ్ ఖాన్ బాబా, శంషా, సంజీవ్ పాటిల్, సందీప్ సెట్, తుకారం, గఫుర్, రహీమన్, ఇమ్రాన్ భక్తులు పాల్గొన్నారు.