హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాక్ పార్లమెంట్నిర్వహించిన విద్యార్థులు

MBNR: రాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మాక్ పార్లమెంట్ నిర్వహించారు. పార్లమెంటు పనితీరు, చట్టాల రూపకల్పన, సభలో చర్చల తీరును విద్యార్థులకు ప్రాక్టికల్‌గా వివరించారు. ఈ కార్యక్రమం నాయకత్వ లక్షణాల పెంపునకు దోహదపడుతుందని ఎంఈవో సుధాకర్ తెలిపారు. ఈ మాక్ పార్లమెంట్ సర్పంచ్ కావలి రామకృష్ణ, హెచ్‌ఎం సయ్యద్ ఇబ్రహీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.