NLG: స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు అర్హులైన బీసీ మహిళలకు ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లు అందించనుంది. సెప్టెంబర్ 15లోగా TSOBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆధార్ తప్పనిసరి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. 18–55 ఏళ్ల మహిళలు అర్హులు. దరఖాస్తు ప్రతిని మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి.
తెలంగాణ
బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు


