హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ

SRD: కంగ్టి మండల తడ్కల్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తులు, బూట్లు, సాక్స్, టైలను సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, ఉప సర్పంచ్ సమీర్, ప్రధానోపాధ్యాయుడు వెంకట్‌తో కలిసి పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ గంగామణి, వీవోఏలు సవిత, సుమా ఉన్నారు.