హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీపై అనవసర చర్చలు వద్దు: కోచ్

2027 వన్డే ప్రపంచకప్‌కు విరాట్ కోహ్లీ దూరమవుతాడంటూ వస్తున్న వార్తలను ఆయన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ ఖండించాడు. కోహ్లీ ఓ అద్భుతమైన మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు. ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో అతని ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. ఈ అంశంపై ఎలాంటి అనవసర చర్చలు అవసరం లేదని చెప్పాడు. కోహ్లీ కచ్చితంగా ప్రపంచకప్ బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు.