ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. యార్క్‌షైర్ జట్టు తరఫున ఆడుతున్న కుల్దీప్.. ఎసెక్స్‌తో పోరులో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టి ఎసెక్స్ పతనాన్ని శాసించాడు. ఈ ప్రదర్శనతో తనను జట్టు నుంచి తప్పించడంపై టీమిండియా యాజమాన్యానికి గట్టి సంకేతాలు పంపాడు.
క్రీడలు
కౌంటీలో అదరగొడుతున్న కుల్దీప్


