హైదరాబాద్: 28°C
క్రీడలు

ASIA CUP: నేడు రెండో సెమీఫైనల్

మహిళల టీ20 ఆసియా కప్ రెండో సెమీస్‌లో ఈరోజు పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు.. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో తలపడుతుంది. దీంతో ఫైనల్ చేరడమే లక్ష్యంగా రెండు జట్లు కూడా హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమయ్యాయి.