వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కట్ల హర్షిత్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని స్టేషన్‌లోకి పరుగెత్తాడు. భార్యాభర్తల మధ్య వివాదం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అతడిని కాపాడే ప్రయత్నంలో రైటర్ ప్రవీణ్, హెడ్ కానిస్టేబుల్ మగ్దూం గాయపడ్డారు. ముగ్గురిని చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం


