హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం'

SRCL: చందుర్తి మండలం సనుగుల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మట్టితో వినాయక ప్రతిమలను తయారు చేసి ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ముఖేష్ కటుకూరి మాట్లాడుతూ.. మట్టి వినాయకులను పూజించడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చన్నారు. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలన్నారు.