హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెల్ టవర్ ఏర్పాటుపై స్థానికుల ఆందోళన

SRPT: హుజూర్‌నగర్‌లో ఏరియా ఆసుపత్రి ఎదురుగా సెల్ టవర్ ఏర్పాటుపై స్థానికులు ఆందోళన చేస్తూ పురపాలక సంఘం కమిషనర్, చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నిర్మాణం ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. టవర్ పనులు అపాలని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా, 'మాకు అన్ని అనుమతులు ఉన్నాయని, పనులు ఆపేది లేదని' నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు.