హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలి'

SRCL: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజించాలని ఎస్పీ మహేష్ బి గితే పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి మట్టి గణపతులను పంపిణీ చేశారు. మండప నిర్వాహకులు పోలీస్ సూచనలు పాటిస్తూ, గణేష్ పోర్టల్‌లో వివరాలు తప్పక నమోదు చేసి ఉత్సవాలను శాంతియుతంగా జరపాలని కోరారు.