హైదరాబాద్: 28°C
క్రీడలు

ఊపిరి కూడా పీల్చుకోవడం కష్టమైంది: షఫాలీ

మహిళల ఆసియాకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్‌లో మిగతా బ్యాటర్లు ఇబ్బంది పడిన షఫాలీ వర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. అయితే, పవర్ ప్లేలో తన పని భారీ షాట్లు కొట్టడమేనని ఆమె తెలిపింది. 'ఇక్కడి వాతావరణం చాలా ఉక్కపోతగా అనిపించింది. ఒక్కోసారి ఊపిరి పీల్చుకోవడమూ కష్టంగా మారింది' అని షఫాలీ పేర్కొంది.