MDK: చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ నిర్వహించినట్లు ఎంఈవో నీరజ తెలిపారు. చేగుంట హైస్కూల్ విద్యార్థులకు టెటానస్ దిఫ్తీరియా (TD) వ్యాక్సినేషన్ చేశారు. పిల్లలకు వ్యాధులు రాకుండా వ్యాక్సినేషన్ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సౌజన్య, ఏఎన్ఎం నాగమణి, ఏఎన్ఎం నవనీత పాల్గొన్నారు.
తెలంగాణ
వ్యాధుల బారిన పడకుండా పిల్లలకు టీకాలు


