ADB: ఇచ్చోడ మండలంలోని గాంధీనగర్‌లో పత్తి పంట మధ్య అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న యెర్మ మారుతిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు CI రమేష్ శుక్రవారం తెలిపారు. నిందితుడి నుంచి రూ. 50 వేల విలువైన 5 గంజాయి మొక్కలు, 67 గ్రాముల ఎండు గంజాయితో పాటు ఎలుగుబంటి గోరును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గంజాయి పండించినా, అమ్మిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
పత్తి పంటలో గంజాయి సాగు..!


