ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. వివిధ గ్రూపుల్లో 561 సీట్లకు గాను, మొదటి విడతలో 538 సీట్లు కేటాయించారు. ఇప్పుడు వరకూ 407 సీట్లకు అడ్మిషన్లు పూర్తయ్యాయని ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. మిగిలిన 131 సీట్లకు శుక్రవారం (నేడు) సాయంత్రానికి అడ్మిషన్లు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ కళాశాలలో జోరుగా డిగ్రీ అడ్మిషన్లు


