హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అంతర్ల పెంటపాడు క్వారీకి అనుమతులు లేవు'

ASR: అంతర్ల పెంటపాడు క్వారీ పనులకు అనుమతులు లేవని జేసీ శ్రీపూజ తెలిపారు. శుక్రవారం అంతర్ల పెంటపాడుకు చెందిన పలువురు స్థానికులు క్వారీ నిలిపివేయాలని పాడేరు గ్రీవెన్స్ లో జేసీకి వినతిపత్రం అందజేశారు. స్పందించిన జేసీ మైనింగ్ అధికారితో మాట్లాడి పనులు నిలిపివేయాలన్నారు. అనుమతులు లేకుండా క్వారీ పనులు చేపడితే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.