SRCL: కోనరావుపేట మండలం మర్రిమడ్ల-వేములవాడ ఆర్టీసీ బస్సులు కోరుట్ల బస్టాండ్‌కు వెళ్లకుండా నంది చౌరస్తా వద్దే డ్రైవర్లు దింపేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. నిబంధన ప్రకారం బస్టాండ్‌లో యూటర్న్ తీసుకుని వెళ్లాలి. అర కి.మీ. ముందే దింపేయడంతో వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
'నంది చౌరస్తా వద్దే ప్రయాణికులను దింపేస్తున్నారు'


