హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీ టవర్‌ల ఏర్పాటుకు మంత్రి హామీ

PDPL: పెద్దపల్లిలో ఐటీ టవర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ విజయరమణ రావు పలుమార్లు విజ్ఞప్తి చేశారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రామగుండంలోనూ టవర్ కావాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారన్నారు. ఉత్తర తెలంగాణలో ఐటీ విస్తరణకు ఈ ప్రతిపాదనలను పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.