హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ పోషణ మాసం ప్రారంభం..!

KMM: జిల్లాలో నెల రోజుల పాటు జరిగే జాతీయ పోషణ మాసం కార్యక్రమాలను కలెక్టర్ దివాకర టీఎస్ ప్రారంభించారు. శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సభలో ‘మన అంగన్‌వాడీ – మన బాధ్యత’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. చిన్నారులు, మహిళలకు పౌష్టికాహారం అందించడం అందరి బాధ్యతని, ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.