W.G: జిల్లాలోని రేషన్ దుకాణాల్లో 18 నెలలుగా కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో తెల్లకార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ షాపులో కిలో రూ.67కే లభించే కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో రూ.140కిపైగా పలుకుతోంది. అధిక ధరలతో సామాన్యులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే సరఫరా పునరుద్ధరించి పేదలకు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
18 నెలలుగా కందిపప్పు సరఫరా బంద్..!


