AP: రాష్ట్రంలోని గిరిజన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. దీని కోసం CSR నిధుల నుంచి రూ.1 కోటితో 25 అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి పనులు ఈ నెలాఖరులోగా ప్రారంభమవుతాయన్నారు.
వార్తలు
గిరిజన బాలల భవిష్యత్తుకు పవన్ భరోసా


