హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్‌స్టేషన్ ఎదుట సీపీఎం ధర్నా

KMM: వ్యవసాయ రంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కూసుమంచిలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. విద్యుత్తు కోతలను ఎత్తివేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ శాఖ డీఈ నాగేశ్వరరావు, ఏడీఈ వెంకటేశ్‌కు వినతి పత్రం అందజేశారు.