హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పంట వివరాలను డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదు చేయాలి'

VKB: యాలాల మండలంలోని రైతులు సన్న వడ్లకు ప్రభుత్వం అందించే రూ. 500 బోనస్ పంట వివరాలను డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదు చేయాలని వ్యవసాయాధికారిణి శ్వేతరాణి ఓ ప్రకటనలో తెలిపారు. డీలర్ల దగ్గర కొన్న రైతులు రసీదులు తీసుకుని, వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదు చేయించుకోవాలన్నారు. AEOలు గ్రామాల వారిగా రైతుల పొలాలకు వచ్చి ఫొటోలను యాప్‌లో నమోదు చేస్తారన్నారు.