హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే క్యాంపులో ప్రజా దర్బార్

BPT: ప్రజల సమస్యల పరిష్కారం కోసం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హాజరై ప్రజల నుంచి స్వయంగా 22 వినతిపత్రాలను స్వీకరించారు. వీటిలో ఇంటి స్థలాలు, నిర్మాణాల కోసం 16 CMRF, 2 ఇతర సమస్యలపై 4 అర్జీలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు.