KNR: రాములపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ అనుమాండ్ల రాంరెడ్డి పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మనోహర్‌రెడ్డి, గ్రామ పాలన అధికారి గీత, ఉపసర్పంచ్ బత్తుల సురేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


