హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన MLA

అనకాపల్లి శారదా నది ఘాట్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఇవాళ పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత, వెలుతురు, తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.