హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త పింఛన్ల దరఖాస్తుల పరిశీలన

TPT: నగరంలో క్లస్టర్-5, వార్డ్-1 పరిధిలోని సచివాలయంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణను జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.