NRML: దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్ గ్రామపంచాయతీని ఎంపీవో గోవర్ధన్ శుక్రవారం సందర్శించారు.గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించడంతో పాటు కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఎన్యూమరేషన్ వివరాలను పరిశీలించి, ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. గ్రామపంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
తెలంగాణ
సిర్గాపూర్ గ్రామపంచాయతీలో ఎంపీవో తనిఖీ


