NRML: కడెంలో సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలి కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఒకే కూలీ రేట్లు అమలు చేసి,బస్తాకు రూ.15 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
'హమాలి కార్మికుల కూలీ రేట్లు పెంచాలి'


