హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వికసిత భారత్‌కు యువత నైపుణ్యాలే కీలకం'

కృష్ణా: ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో శిక్షణ పొందుతున్న యువతతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది ఏదీ లేదన్నారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధితో ఎదగాలని సూచించారు. వికసిత భారత్‌ సాధనకు యువత నైపుణ్యాభివృద్ధి కీలకమన్నారు. దేశ ప్రగతిలో యువత భాగస్వాములు కావాలని కోరారు.