ASR: అరకు మండలం మాదల పంచాయతీ పరిధిలో అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కొత్త ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరు చేసేందుకు దరఖాస్తు గడువు పెంచాలని గిరిజన సంఘం మండల నేత రమేష్ ఇవాళ కోరారు. దరఖాస్తులకు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఇంటి పన్ను, కరెంట్ బిల్లు, ఆధార్, ఓటర్ ఐడీ తదితర పత్రాలు అవసరమవుతున్నాయన్నారు. సిగ్నల్, సర్వర్ సమస్యలు నెలకొన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పెన్షన్ దరఖాస్తుల గడువు పెంచాలి'


