హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టుచీరపై వాసవి కన్యకా పరమేశ్వరి దివ్యచరిత్ర

SRCL: చేనేత మగ్గంపై తనదైన సృజనాత్మకతతో వినూత్న కళాఖండాలను ఆవిష్కరిస్తున్న ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరి ప్రసాద్ మరో అరుదైన సృష్టికి రూపకల్పన చేశారు. గుంటూరుకు చెందిన రత్నకుమారి–కోటేశ్వరరావు ఇచ్చిన ప్రత్యేక ఆర్డర్ మేరకు సుమారు 45 రోజులపాటు నిరంతరంగా శ్రమించి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య చరిత్రను ప్రత్యేక పట్టుచీరపై అద్భుతంగా ఆవిష్కరించారు.