హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి: AEO

BHPL: రేగొండ మండలం చల్లగరిగేలో ఇవాళ రైతు నమోదు కార్యక్రమం AEO దీపక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. AEO మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎరువులు, పెట్టుబడి సాయం, సబ్సిడీలు పొందేందుకు రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. నమోదైన రైతుల ఖాతాల్లో ప్రయోజనాలు నేరుగా జమ అవుతాయని తెలిపారు.