హైదరాబాద్: 28°C
తెలంగాణ

గన్‌పార్క్ వద్ద ఉద్రిక్త

HYD: గన్‌పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్వీ నేతలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున విద్యార్థులు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అడ్డుకోగా స్వల్ప తోపులాట జరిగింది. కాగా ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ స్టేడియం నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్వీ నేతలు ర్యాలీకి వెళ్లేందుకు యత్నించారు.