హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కనిగిరిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ'

ప్రకాశం: కనిగిరి అమరావతి గ్రౌండ్స్‌లో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి 46 మంది లబ్ధిదారులకు రూ.27.23 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆపద సమయంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం కోసం ఖర్చు చేసిన పేద కుటుంబాలకు సీఎం చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలుస్తున్నారని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.