KMR: పిట్లంలోని చిన్న కొడప్‌గల్ సమీపంలో శుక్రవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో వాహనదారుడు గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి కుడికాలు విరిగినట్లు సమాచారం. స్థానికులు హైవే అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు


