హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తిలో కొనలు త్రుంచితే అధిక దిగుబడి : ఏఈవో

SRD: పత్తి పంటలో సరైన సమయంలో ప్రధాన కాండం కొనలను త్రుంచడం (ట్యాపింగ్) వల్ల మొక్కకు పోషకాలు సమృద్ధిగా అంది, కాయ పరిమాణం పెరిగి అధిక దిగుబడి సాధించవచ్చని ఏఈవో సంతోష్ సూచించారు. ఇవాళ కంగ్టి మండల భీమ్రాలో నిర్వహించిన రైతు అవగాహణ కార్యక్రమంలో రైతులకు పత్తి సాగులో పాటించాల్సిన ఆధునిక సాంకేతిక యాజమాన్య పద్ధతులపై వివరించారు.