హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సంపేటలో బీజేపీలోకి చేరికలు

WGL: నర్సంపేట పట్టణంలోని మహ్మదాపురం గ్రామానికి చెందిన పలువురు యువకులు శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.గోగుల రాణాప్రతాప్ రెడ్డి వారికి కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందని, రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని రాణాప్రతాప్ తెలిపారు.